బార్డర్​లో భద్రత పెంపు.. రాకెట్​ లాంచర్లు​ సిద్ధం

బార్డర్​లో భద్రత పెంపు.. రాకెట్​ లాంచర్లు​ సిద్ధం

గువహటి: లైన్ ఆఫ్​ యాక్చువల్​ కంట్రోల్​ వెంబడి చైనా కవ్వింపులు పెరుగుతుండటంతో బార్డర్​లో కేంద్రం భద్రతను పెంచుతోంది. ఇందులో భాగంగా అస్సాంలో పినాకా, స్మెర్చ్​మల్టీ రాకెట్​ లాంచర్​ సిస్టమ్స్​ను ఆర్మీ రెడీగా ఉంచింది. పినాకా సిస్టమ్​ను పూర్తిగా దేశీయంగా డీఆర్డీవో తయారు చేసిందని, ఇదో మల్టీ రాకెట్​ లాంచింగ్​ సిస్టమని అధికారులు చెప్పారు. ఒక బ్యాటరీలోని 6 లాంచర్లు 44 సెకన్లలో 72 రాకెట్లను ఫైర్​ చేయగలవన్నారు. ఈ ఆటోమెటిక్​ వెపన్​ సిస్టమ్​38 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్​లను ఈజీగా ఛేదించగలుగుతుందని వివరించారు. స్మెర్చ్​  సిస్టమ్​ దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని కవర్​ చేయగలదని.. ఒక బ్యాటరీలోని 4 లాంచర్లు 40 సెకన్లలో 48 రాకెట్లను ఫైర్​ చేయగలవని తెలిపారు. హిందూ దేవుడు శివుని విల్లు ‘పినాకా’ పేరును ఆర్మీ రాకెట్​లాంచింగ్​ సిస్టమ్​కు పెట్టారు.

ఇంకో మీటింగ్​కు ఇండియా, చైనా నిర్ణయం

ఇండియా, చైనా మధ్య గల్వాన్​లో జరిగిన వివాదంపై 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు విఫలమయ్యాయి. దీంతో చైనా సరిహద్దులో ఆయుధాలను తరలిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక లాంగ్​ రేంజ్​రాకెట్ లాంచర్లను చైనా తాజాగా మోహరించింది. కానీ చైనా మాత్రం తమ జవాన్లు చలి వాతావరణానికి అలవాటు పడాటానికే ఇదంతా చేస్తున్నామని చెబుతోంది. మరోవైపు మన ఆర్మీ ఇప్పటికే ఎం777 అల్ట్రాలైట్‌‌ హోవిట్జర్లను బార్డర్​కు తరలించింది. కాగా, 13వ మీటింగ్​ చర్చలు విఫలమవడంతో మరో మీటింగ్ పెట్టుకోవాలని రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. మీటింగ్​ తేదీలు ఇంకా ఖరారు కాలేదు.