మరో ఆరు నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తాం

మరో ఆరు నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తాం

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు కీలకమైన హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేందుకు మరో ఆరు నెలలు పడుతుందని మేదాంత హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నరేశ్ టెహ్రాన్ తెలిపారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగితే ఇంకో ఆరు నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తామన్నారు. ‘దేశంలో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీని రీచ్ కాలేదు. కానీ మరో ఆరు నెలల్లో దీన్ని సాధిస్తాం. ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేస్తే ఈ టార్గెట్‌‌ను చేరుకుంటాం’ అని నరేశ్ చెప్పారు. ప్రధాని మోడీ టీకా వేయించుకోవడం సంతోషకరమని, ఇది సాధారణ ప్రజల్లో వ్యాక్సినేషన్ సేఫ్ నినాదాన్ని తీసుకెళ్తుందని నరేశ్ పేర్కొన్నారు. వేలాది ప్రజలు కోవ్యాక్సిన్ టీకా వేయించుకున్నారని, ఇది చాలా సేఫ్ అని నిరూపితమైందన్నారు.