టీ20 పగ్గాలు రోహిత్‌ కు ఇవ్వండి: యువరాజ్

టీ20 పగ్గాలు రోహిత్‌ కు ఇవ్వండి: యువరాజ్

న్యూఢిల్లీ: మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌ గా విరాట్‌ కోహ్లీకి వర్క్‌ లోడ్‌ ఎక్కువైందని భావిస్తే టీ20 పగ్గాలను రోహిత్‌ శర్మకు ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ సూచించాడు. ఇద్దరు కెప్టెన్ల విధానాన్ని ప్రయత్నిస్తే.. సారథ్య భారాన్ని అధిగమించొచ్చన్నాడు. ‘గతంలో టెస్ట్‌‌, వన్డేలు మాత్రమే ఉండేవి. కాబట్టి కెప్టెన్‌ గా ఒక్కడు సరిపోయేవాడు. కానీ టీ20ల రాకతో భారం పెరిగింది. ఈ ఫార్మాట్‌ లో రోహిత్‌ విజయవంతమైన సారథి. కోహ్లీ వర్క్‌ లోడ్‌ గురించి టీమ్‌ మేనేజ్‌ మెంట్‌ ఆలోచన ఎలా ఉందో తెలియదు. విరాట్‌ గొప్ప బ్యాట్స్‌ మెన్‌ . అతను కూడా పని ఒత్తిడిని ఎలా మేనేజ్‌ చేసుకుంటాడు? ఇది పూర్తిగా టీమ్‌ మేనేజ్‌ మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. వరల్డ్‌‌కప్‌ లో నాలుగోస్థానం ఎంత కీలకమో తెలుసుకోకపోవడంతోనే ఇండియా ఓడింది. ఇంగ్లండ్‌ పిచ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఫోర్త్‌‌ ప్లేస్‌‌ బ్యాట్స్‌ మె న్‌ టెక్నికల్‌‌గా స్ట్ రాంగ్‌ గా ఉండాలి. విజయ్‌ శంకర్‌‌‌‌, రిషబ్‌ పంత్‌ కు ఆ అనుభవం లేదు. కానీ అనుభవం ఉన్న దినేశ్‌ కార్తీక్‌ కు కీలకమైన సెమీస్‌‌లోనే అవకాశం వచ్చింది.2011 ప్రపంచకప్‌ తర్వాత మరో వరల్డ్‌‌కప్‌ ఆడకపోవడంపై పశ్చాత్తాప పడుతున్నా. టీమ్‌  మేనేజ్‌మట్ ప్రజల నుంచి మద్దతు లభిస్తే మరో వరల్డ్‌‌కప్‌ ఆడేవాడిని’ అని యువరాజ్‌ తెలిపాడు.