4 లక్షల మందిని తీసుకొస్తరు

4 లక్షల మందిని తీసుకొస్తరు
  • విదేశాల్లో చిక్కుకున్నోళ్ల కోసం కేంద్రం ప్లాన్‌
  • ఫ్లైట్లు, షిప్పులతో భారీ ఆపరేషన్‌

న్యూఢిల్లీ: ట్రావెల్‌ బ్యాన్‌ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్లను తీసుకొచ్చేందుకు కేంద్రం అతి పెద్ద ఆపరేషన్‌ చేయబోతోంది. బ్రిటన్‌, సింగపూర్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు సహా వివిధ దేశాల్లోని సుమారు 4 లక్షల మంది మన వాళ్లను రప్పించేందుకు గురువారం నుంచి ఫ్లైట్లు స్టార్ట్‌ చేస్తోంది. ఇందుకోసం ఎయిర్‌ ఇండియా విమానాలు వాడబోబోంది. తొలి రౌండ్‌లో మే రెండో వారం కళ్లా 2 లక్షల మందిని, జూన్‌ చివరి కళ్లా ఇంకో రెండు లక్షల మందిని తీసుకొస్తామని విదేశాంగ శాఖ వెల్లడించింది. మొత్తంగా పది ఫ్లైట్లను వినియోగిస్తున్నామని, ఏడు రోజుల పాటు నడిపిస్తామని చెప్పింది. ఇందులో నాలుగు ఫ్లైట్ల సేవలను గురువారం స్టార్ట్‌ చేస్తామని.. దుబాయ్‌, అబుదాబి, దోహ, రియాద్‌ల నుంచి తీసుకొస్తామని పేర్కొంది. వీళ్లందరూ కేరళ వాళ్లేనంది. ఇండియన్‌ నేవీని కూడా రంగంలోకి దింపుతోంది. మాల్దీవుల్లో చిక్కుకున్న వాళ్లను తీసుకొచ్చేందుకు రెండు షిప్‌లను పంపిస్తోంది. పెద్ద వాళ్లు, వలస కార్మికులు, అర్జెంట్‌ మెడికల్‌ అవసరాలున్న వాళ్లు, ప్రెగ్నెంట్‌ విమెన్‌కు ముందు ప్రాధాన్యం ఇస్తామని దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ చెప్పారు. ఫ్లైట్‌ ఎక్కేముందు అందరినీ స్క్రీనింగ్‌ చేస్తారు. లక్షణాల్లేకుంటేనే ఫ్లైట్‌లోకి అనుమతిస్తారు. ఇక్కడ దిగాక రెండు వారాలు క్వారంటైన్ చేస్తారు