మోడీ కోసం జపాన్ లో ఫ్యాన్స్ ఎదురుచూపులు

మోడీ కోసం జపాన్ లో ఫ్యాన్స్ ఎదురుచూపులు

జీ20 సదస్సు సందర్భంగా జపాన్ లో పర్యటిస్తున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ ఉదయం జపాన్ లోని ఒసాకాలో దిగిన ఆయన.. ఆ తర్వాత జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచే చర్యలపై చర్చించిన తర్వాత.. మోడీ.. హోగీ ప్రిఫెక్చర్ గెస్ట్ హౌజ్ లో ప్రవాస భారతీయులతో మాట్లాడబోతున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు ఉదయం నుంచే ఎన్నారైలు బారులు తీరారు. చినుకులు పడుతున్నా… ఓపికతో లైన్ లో నిల్చున్నారు. మోడీ సభకోసం తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు చెప్పారు.