ఏఎఫ్‌‌‌‌సీ అండర్‌‌‌‌–17 విమెన్స్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌: ఇండియా ఓటమి

ఏఎఫ్‌‌‌‌సీ అండర్‌‌‌‌–17 విమెన్స్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌: ఇండియా ఓటమి

సుజౌ (చైనా): ఏఎఫ్‌‌‌‌సీ అండర్‌‌‌‌–17 విమెన్స్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌లో ఇండియా పోరాటం క్వార్టర్‌‌‌‌ ఫైనల్లోనే ముగిసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఆతిథ్య చైనా 3–0తో ఇండియాపై గెలిచింది. ఈ ఓటమితో ఇండియా 2026 ఫిఫా అండర్‌‌‌‌–17 విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు అర్హత సాధించలేకపోయింది.

అయితే ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి నాకౌట్‌‌‌‌ దశకు చేరుకుని అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. చైనా తరఫున హుయాంగ్‌‌‌‌ క్విని (38వ ని), లియు యుక్వీ (45-+4వ ని), లీ జియాన్‌‌‌‌ (89వ ని) గోల్స్‌‌‌‌ చేశారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఇండియా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు.