ఇండియా వద్ద  ప్లాన్‌‌‌‌-బి లేదు

ఇండియా వద్ద  ప్లాన్‌‌‌‌-బి లేదు

లండన్‌‌‌‌: నాకౌట్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో ఇండియాను ఎవరైనా ఓడించొచ్చని ఇంగ్లండ్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ నాసిర్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. టీమిండియా వద్ద ప్లాన్‌‌‌‌–బి లేకపోవడమే ఇందుకు కారణమన్నాడు. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో సడెన్‌‌‌‌గా ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్లాన్‌‌‌‌–బి తప్పనిసరిగా ఉండాలన్నాడు. ‘ఇండియా ఫేవరెట్‌‌‌‌ టీమే. కానీ క్లియర్‌‌‌‌ ఫేవరెట్స్‌‌‌‌ మాత్రం కాదు. ఎందుకంటే ఫార్మాట్‌‌‌‌లో ఎదురయ్యే సవాళ్లను బట్టి ఈ విషయాన్ని చెబుతున్నా. టీ20ల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం చాలా కష్టం. వ్యక్తిగతంగా 70, 80 రన్స్‌‌‌‌ చేసినా, మూడు బాల్స్‌‌‌‌లోనే మ్యాచ్‌‌‌‌ మొత్తం టర్న్‌‌‌‌ కావొచ్చు. ఆ టైమ్‌‌‌‌లో ప్లాన్‌‌‌‌–బి అనేది అత్యవసరం. అది ఇండియా వద్ద లేదు. అందుకే నాకౌట్‌‌‌‌లో ఎవరైనా కోహ్లీసేనను ఓడించొచ్చు. టాప్​ ఆర్డర్​ ఫెయిలైతే ఆదుకునే స్ట్రాంగ్​ మిడిలార్డర్​ఎక్స్​పీరియెన్స్​ లేదు’ అని నాసిర్‌‌‌‌ వివరించాడు.