ఇండియా విమానాలకు గ్రీన్‌సిగ్నలిచ్చిన దుబాయ్

ఇండియా విమానాలకు గ్రీన్‌సిగ్నలిచ్చిన దుబాయ్

కరోనాతో ఆగిపోయిన విమాన సర్వీసులకు దుబాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఇండియా, దుబాయ్‌ల మధ్య జూన్ 23 నుంచి విమాన సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌తో ఇండియా ఫ్లైట్స్‌ను దుబాయ్ ప్రభుత్వం జూలై 6 వరకు బంద్ చేస్తూ నిర్ణయించింది. కానీ ఇండియాలో కరోనా కంట్రోల్లోకి రావడంతో నిషేధ గడువును తగ్గించింది. భారత్‌లో కరోనా కంట్రోల్లోకి రావడంతో విమాన సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు దుబాయ్ ఎమైరేట్స్ ప్రకటించింది. ఇండియాతో పాటు సౌతాఫ్రికా, నైజీరియాకు విమానాలు నడపాలని నిర్ణయించింది. అయితే దుబాయ్ వచ్చే ప్రయాణికులకు యూఏఈ కొన్ని కండీషన్లు పెట్టింది. 

  • యూఏఈ అప్రూవ్ చేసిన రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారికే అనుమతి
  • ప్రయాణానికి 2 రోజుల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ వచ్చినట్లు సర్టిఫికెట్ చూపించాలి.
  • ఆర్టీపీసీఆర్ ఫలితాలు క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అనుమతిస్తారు.
  • నెగిటివ్ పీసీఆర్ సర్టిఫికెట్‌తో పాటు ప్రయాణీకులు విమానంలో ఎక్కడానికి నాలుగు గంటల ముందు కూడా పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.
  • దుబాయ్‌లో దిగిన తర్వాత కూడా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
  • అక్కడ చేసిన పీసీఆర్ టెస్టు రిజల్ట్ వచ్చేంతవరకు.. ఎయిర్‌పోర్టులో ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్‌లోనే ఉండాలి.