భారత్ లో పాకిస్తాన్ పౌరులు..స్వల్ప ఊరటనిచ్చిన భారత్

భారత్ లో పాకిస్తాన్ పౌరులు..స్వల్ప ఊరటనిచ్చిన భారత్

ఇండియాలో ఉన్న పాకిస్థానీయులకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారు దేశం వీడి పోయేందుకు గడువును పొడిగించింది. ఏప్రిల్ 30లోగా భారత్లోని పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని గతంలో కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆంక్షలు సదలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అటారీ సరి హద్దు నుంచి పాక్ వెళ్లేందుకు అనుమతిస్తారు.

మే 1  ఉదయం కూడా పలువురు పాక్ అట్టారీ సరిహద్దు వద్దకు రాగా, ముందుగా వారిని అను మతించని భద్రతా సిబ్బంది. ఆ తర్వాత ఉన్నతా ధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో అనుమతిం చారు. ఏప్రిల్ 24 నుంచి 30 మధ్య ఇండియా నుంచి మొత్తం 926 మంది పాక్ పౌరులు వారి దేశం వెళ్లిపోగా, అదే సమయంలో అక్కడి నుంచి 1,841 మంది ఇండియన్స్ భారత్ కు తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.