కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీకి రెడీ అయిన ఇండియా షట్లర్లు.. మెన్స్ సింగిల్స్‌లో ఫ్రాన్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల ఆరంభంలో డెన్మార్క్‌లోని హోర్సెన్స్‌లో జరిగిన థామస్ కప్ సెమీస్‌లో ఇండియా 0–3తో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. అయితే ఆ మూడు సింగిల్స్‌లో ఆడిన ప్లేయర్లు ఇప్పుడు ఈ టోర్నీలోనూ ఇండియన్స్‌తో తలపడుతున్నారు. దాంతో వీళ్లపై గెలిచి థామస్ కప్ ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నారు.
మోచేతి గాయంతో థామస్ కప్‌కు దూరమైన లక్ష్యసేన్.. తొలి రౌండ్‌లో మోహ్ జాకీ ఉబైదిల్లా (ఇండోనేసియా)తో తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో తరుణ్ మానేపల్లి.. జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్), కిరణ్ జార్జ్.. అలెక్స్ లానియర్ (ఫ్రాన్స్), హెచ్. ఎస్. ప్రణయ్.. క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో తలపడనున్నారు. డబుల్స్‌లో హరిహరన్, ఎం.ఆర్. అర్జున్ ద్వయం.. ఏడోసీడ్ ఫ్రెంచ్ జోడీ క్రిస్టో పొపోవ్, జూనియర్ పొపోవ్‌ను ఎదుర్కోనున్నారు. విమెన్స్ సింగిల్స్‌లో తన్వీ శర్మ.. పిచ్చామోన్ ఓపట్నిపుత్ (థాయ్‌లాండ్)తో, ఉన్నతి హుడా.. హాన్ కియాన్స్ క్సీ (చైనా)తో, మాళవిక బన్సోద్.. వైవోస్ లీ (జర్మనీ)తో.. అన్మోల్ ఖర్బ్.. లైన్ హోజ్ మార్క్ కెర్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో తలపడనున్నారు.
