పత్రికా స్వేచ్ఛలో మనం మెరుగయ్యాం.. భారత్ స్థానం151

పత్రికా స్వేచ్ఛలో మనం మెరుగయ్యాం.. భారత్ స్థానం151

పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ నివేదిక ప్రకారం భారత్ గత ఏడాది కంటే తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నది. ఈ ఏడాది మొత్తం 180 దేశాలకు సంబంధించి నిర్వహించిన సర్వేలో భారత్ 151వ స్థానంలో నిలిచింది. గత ఏడాది మన దేశం 159వ స్థానంలో ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి ర్యాంకులను ఖరారు చేసినట్లు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో విధాన నిర్ణేతలు, పాత్రికేయులు, విభిన్న సైద్ధాంతిక భావజాలంతోపాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని సంస్థ వెల్లడించింది.

    ఈ ఏడాది ఫిన్​లాండ్, ఎస్తోనియా, నెదర్లాండ్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 
    అమెరికా గత ఏడాది కంటే రెండు స్థానాలు దిగజారి 57వ ర్యాంకులో నిలిచింది.
    భారత్​లో సుమారు 900 ప్రైవేట్ టీవీ చానళ్లు ఉన్నాయని, వాటిలో సగం న్యూస్ చానళ్లేనని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొన్నది. 
    20కి పైగా భాషల్లో 1,40,000 ప్రచురణలు వెలువడుతున్నాయని, వీటిలో 20 వేల దిన పత్రికలకు ప్రతిరోజు 39 కోట్లకుపైగా సర్క్యులేషన్ ను కలిగి ఉన్నాయని వెల్లడించింది. 
    రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ. 
    పారిస్​లో దీని ప్రధాన కార్యాలయం ఉన్నది.
    సమాచార హక్కు పరిరక్షణ కోసం కృషి చేస్తోంది.