కరోనాతో భారత్ నాశనమైంది 

V6 Velugu Posted on Jun 18, 2021

వాషింగ్టన్ డీసీ: కరోనా వైరస్ వల్ల భారత్ సర్వనాశనమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని ఆరోపించిన ట్రంప్.. ఇందకు గానూ యూఎస్‌కు 10 ట్రిలియన్ డాలర్లను చైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫాక్స్ న్యూస్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ పైవ్యాఖ్యలు చేశారు. యూఎస్‌తోపాటు మిగిలిన ప్రపంచ దేశాలకు చైనా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. 

‘కరోనా వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. భారత్‌ను చూసుకుంటే మహమ్మారి విజృంభణతో ఆ దేశం కునారిల్లింది. అన్ని విషయాల్లోనూ దూసుకెళ్తున్న ఇండియా కరోనా దెబ్బకు సర్వనాశనమైంది. భారత్‌తోపాటు చాలా దేశాలు నాశనమయ్యాయి’ అని ట్రంప్ చెప్పారు. ప్రజారోగ్యం విషయంలో  తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి పూర్తి బాధ్యతను చైనా తీసుకోవాలన్నారు. 

Tagged India, China, compensation, United States of America, corona spread, China virus, World Countries, US Former President Donald Trump

Latest Videos

Subscribe Now

More News