నేపాల్ తో భారత్ కు ప్రత్యేక సంబంధాలు

నేపాల్ తో భారత్ కు ప్రత్యేక  సంబంధాలు

భారత్-నేపాల్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు చాలా ప్రత్యేకమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి స్నేహం ప్రపంచంలో ఎక్కడా కనిపించదని పేర్కొన్నారు. నేపాల్ అభివృద్ధి ప్రయాణంలో భారత్ తోడ్పాటు అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని షేర్ బహదుర్ దేవ్బాతో దిల్లీలో భేటీ తర్వాత ఇద్దరు నతేలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. నేపాల్ హైడ్రోపవర్ అభివృద్ధి ప్రణాళికల్లో భారత కంపెనీలు భాగం కానున్నాయని మోదీ తెలిపారు. దీనిపై ఇరువురూ అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. భవిష్యత్ సహకారానికి ఈ ఒప్పందం బ్లూప్రింట్గా నిలుస్తుందని ఉద్ఘాటించారు. విద్యుత్ రంగంలో ఉన్న సహకారం నుంచి ఇరుదేశాలు ప్రయోజనాలు పొందాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమిలో నేపాల్ చేరడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా నేపాల్లో రూపే కార్డు సేవలను ఇరువురు దేవ్బాతో కలిసి మోదీ ప్రారంభించారు.
 

ఇవి కూడా చదవండి

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి

వేగంగా వ్యాపిస్తున్న మరో కొత్త వేరియంట్

రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్