
రూర్కెలా: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో ఇండియా బోణీ చేసింది. శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఇండియా 3–2తో వరల్డ్ చాంపియన్ జర్మనీకి చెక్ పెట్టింది. వరల్డ్‌కప్ వైఫల్యం తర్వాత ఇండియాకు ఇది తొలి విక్టరీ కావడం విశేషం. టీమిండియా తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (30వ ని.), సుఖ్‌జిత్ సింగ్ (31వ, 42వ ని.) గోల్స్ చేయగా, పాల్ ఫిలిప్ప్ కౌఫ్‌మన్ (44వ ని.), మైకేల్ స్ట్రుతాఫ్ (57వ ని.) జర్మనీకి గోల్స్ అందించారు. స్టార్టింగ్ నుంచి దూకుడుగా ఆడిన ఇండియా ఫార్వర్డ్స్ తొలి హాఫ్‌లో 1–0 లీడ్‌లో నిలిచారు. స్కోరు సమం చేయడానికి రెండో హాఫ్‌లో జర్మనీ ఎదురుదాడికి దిగినా సక్సెస్ కాలేదు. నాలుగు పెనాల్టీలను గోల్స్‌గా మల్చలేకపోయింది.