సెలక్టర్ల నుంచి కోహ్లీ, రోహిత్లకు మొండిచేయి?

సెలక్టర్ల నుంచి కోహ్లీ, రోహిత్లకు మొండిచేయి?

టీ20 ఫార్మాట్లో సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇక చోటు లేదా అంటే.. అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. తాజాగా లంకతో జరిగిన టీ20 సిరీస్ తో పాటు, ఈ నెల 18 నుంచి కివీస్తో జరగబోయే టీ20 సిరీస్ లకు ఈ ఇద్దరిని పక్కన పెట్టారు. ఇకపై జరిగే టీ20 సిరీస్ ల్లో పూర్తిగా కుర్రాళ్లనే ఆడించనున్నట్లు తెలుస్తుంది.

టీ20 ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత బీసీసీఐ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోహ్లీ, రోహిత్ లతో పాటు మరికొందరు సీనియర్ ఆటగాళ్లను టీ20లకు దూరంగా ఉంచుతున్నారు. వీళ్లను వన్డే, టెస్ట్ జట్టులకు పరిమితం చేసే ఉద్దేశంలో సెలక్టర్లు ఉన్నారు. కుర్రాళ్ల జట్టును కెప్టెన్ గా హార్దిక్ పాండ్య చక్కగా నడిపిస్తున్నాడు. సీనియర్ల విషయంలో పాండ్యా కూడా సెలక్టర్లతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ అభిమానులు ఇక విరాట్, రోహిత్ లను టీ20ల్లో చూడకపోవచ్చు. 2024 ప్రపంచకప్ కోసం ఇప్పటినుంచే కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తూజట్టు కూర్పును మొదలుపెట్టారు. 

అయితే, ఈ విషయంపై రోహిత్ స్పందిస్తూ టీ20లను వదిలేసే  ఆలోచనైతే తనకు లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్​ తర్వాత దీని గురించి ఆలోచిస్తానన్నాడు. ‘ఈ మధ్యలో మిగిలున్నవి మూడు టీ20 మ్యాచ్ లే. వాటిలో యంగ్ స్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నాం’ అన్నాడు.