ND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా.. ప్లేయింగ్ 11 నుంచి వరుణ్ ఔట్

ND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టీ20..  టాస్ గెలిచిన టీమిండియా.. ప్లేయింగ్ 11 నుంచి వరుణ్ ఔట్

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఆదివారం (జనవరి 25)  గౌహతి వేదికగా  బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో నిలిచింది. నేడు జరగనున్న మ్యాచ్ లోనూ గెలిచి టీమిండియా సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. 

రెండో టీ20కి దూరమైన బుమ్రా మూడో టీ20 కి జట్టులో వచ్చాడు. మరోవైపు స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. కివీస్ విషయానికి వస్తే ఫౌల్కేస్ స్థానంలో జేమిసన్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):

డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జామిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ

భారత్ (ప్లేయింగ్ XI): 

సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా