
ఆదివారం (సెప్టెంబర్ 28) ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 41 ఏళ్ళ ఆసియా కప్ చరిత్రలో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య తొలిసారి ఫైనల్ జరగనుంది. టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగింది. అర్షదీప్ సింగ్ స్థానంలో బుమ్రా.. హర్షిత్ రానా స్థానంలో ఆల్ రౌండర్ శివమ్ దూబే జట్టులోకి వచ్చాడు. గాయపడిన హార్దిక్ పాండ్య స్థానంలో రింకూ సింగ్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు పాకిస్థాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
భారత్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి
►ALSO READ | Asia Cup 2025 final: కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్.. అభిషేక్, పాండ్యా గాయాలపై టీమిండియా బౌలింగ్ కోచ్ అప్ డేట్