Asia Cup 2025: యూఏఈతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ప్లేయింగ్ 11 నుంచి అర్షదీప్ ఔట్

Asia Cup 2025: యూఏఈతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ప్లేయింగ్ 11 నుంచి అర్షదీప్ ఔట్

ఆసియా కప్ లో టీమిండియా మరికాసేపట్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం (సెప్టెంబర్ 10) యూఏఈతో ప్రారంభమైన మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇండియానే ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఇండియా కేవలం ఒక్క స్పెషలిస్ట్ పేసర్ తోనే మ్యాచ్ ఆడుతోంది. తుది జట్టులో అర్షదీప్ సింగ్ కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య రూపంలో ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారు. సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ప్లేయింగ్ XI): 

ముహమ్మద్ వసీమ్(కెప్టెన్), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్

భారత్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి 

►ALSO READ | Team India: టీమిండియాలో డిసిప్లిన్ క్రికెటర్ ఎవరు..ఇద్దరి పేర్లు చెప్పిన రింకూ సింగ్!