Team India: టీమిండియాలో డిసిప్లిన్ క్రికెటర్ ఎవరు..ఇద్దరి పేర్లు చెప్పిన రింకూ సింగ్!

Team India: టీమిండియాలో డిసిప్లిన్ క్రికెటర్ ఎవరు..ఇద్దరి పేర్లు చెప్పిన రింకూ సింగ్!

టీమిండియాలో ఎవరు బాగా ఆడతారో చెప్పొచ్చు.. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారో కనిపెట్టొచ్చు. కానీ ఎవరు క్రమశిక్షణగా ఉంటారో చెప్పడం కష్టం. డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటున్నవారికి తప్పితే ఈ విషయం ఎవరికీ తెలియదు. గెలవాలనే కసి.. ఆత్మవిశ్వాసం.. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండే తత్వం ఒక ఆటగాడిని గొప్ప స్థితిలో ఉంచుతాయి. ఈ లక్షణాలు ప్రస్తుతం టీమిండియాలో ఎవరికి ఉన్నాయో యువ క్రికెటర్ రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఎంతో యూఏఈ తో మ్యాచ్ కు ముందు టీమిండియాలో డిసిప్లిన్ క్రికెటర్స్ ఎవరనే ప్రశ్నకు ఇద్దరు క్రికెటర్ల పేర్లు చెప్పాడు.  

టీమిండియా బ్యాటింగ్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇండియన్ క్రికెట్ లో మోస్ట్ డిసిప్లిన్ క్రికెటర్స్ అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ తన దూకుడుతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్ లాగేసుకుంటాడు. ఫిట్ నెస్ పై అతని శ్రద్ధ.. పోరాడే తత్వం.. మ్యాచ్ గెలవాలనే కసి.. సహచర ప్లేయర్లను ఎంకరేజ్ చేయడం లాంటి లక్షణాలు అందరికంటే కోహ్లీలో ఎక్కువగా కనిపిస్తాయి. మరోవైపు సూర్య ఎంతో ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చూసుకుంటాడు. కాప్లిమెంట్స్ కు దగ్గరగా.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ జట్టును నడిపిస్తాడు.

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ లో బుధవారం (సెప్టెంబర్ 10) తొలి మ్యాచ్ యూఏఈతో ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో రింకు సింగ్ కు తుది జట్టులో స్థానం ఉంటుందో లేదో ప్రస్నార్ధకంగా మారింది. ఆల్ రౌండర్ దూబేతో రింకూకి గట్టి పోటీ నెలకొంది. రింకూ సింగ్ చివరి 7 టీ20 మ్యాచ్ లు చూసుకుంటే 13.40 సగటుతో కేవలం 67 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని స్ట్రైక్ రేట్ (101.51) కూడా దారుణంగా ఉంది. వరుసగా తుది జట్టులో అవకాశాలిస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు. ఐపీఎల్ ప్రదర్శన చూసుకున్నా దారుణంగా ఉంది. అయినప్పటికీ ఆసియా కప్ స్క్వాడ్ లో చోటు దక్కించుకున్న ఈ యూపీ ఆటగాడు ఎలా ఆడతాడో చూడాలి.