
పెర్త్: ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియా విమెన్స్ హాకీ టీమ్ ఇంకా గాడిలో పడలేదు. ఆస్ట్రేలియా–ఎతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా.. కంగారూల మెయిన్ టీమ్‌తో జరిగిన పోరులోనూ పరాజయంపాలైంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 2–0తో ఇండియాపై నెగ్గింది.
ఆసీస్ తరఫున కోర్ట్నీ స్కోనెల్ (9వ ని), గ్రేసీ స్టీవార్ట్ (52వ ని) గోల్స్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆసీస్.. ఇండియా డిఫెన్స్‌పై తీవ్ర ఒత్తిడిని తెచ్చి పెనాల్టీ కార్నర్‌ను సాధించింది. 9వ నిమిషంలో స్కోనెల్ గోల్ కొట్టి టీమ్‌ను 1–0 లీడ్‌లో నిలిపింది. నాలుగో క్వార్టర్‌లో స్టీవార్ట్ ఓపెన్ ప్లే నుంచి నెట్‌లోకి బాల్‌ను పంపి మ్యాచ్‌ను ఆసీస్ వైపు తీసుకెళ్లింది.