స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కోసం రష్యాతో భార‌త్‌ సంప్రదింపులు

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కోసం రష్యాతో భార‌త్‌ సంప్రదింపులు

ప్రపంచ దేశాల‌న్నీ కరోనా వైర‌స్ ను క‌ట్ట‌డి చేసేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ క‌రోనా కు మందుగా స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం వెల్లడించింది. ఇప్పటికే ఈ విషయంపై రష్యా-భారత్‌లు చర్చించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ తెలిపారు.

అయితే, రష్యా కూడా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్న‌ట్టు తెలిసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ ద్మిత్రీవ్ ఈమేరకు వెల్లడించారు. లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాలు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. భారత భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భారత్ తోపాటు యూఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత్ తోపాటు మరో ఐదు దేశాల్లో వ్యాక్సిన్‌ను  ఉత్పత్తి చేస్తామని చెప్పారు.

India in talks with Russia on Sputnik-V covid vaccine: Health Ministry