5.2 శాతం పెరిగిన ఐఐపీ

 5.2 శాతం పెరిగిన ఐఐపీ

న్యూఢిల్లీ: తయారీ రంగం మెరుగుపడటంతో గత నెల భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 5.2 శాతం వృద్ధి సాధించింది. 2025 ఫిబ్రవరిలో ఇది 2.7 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో పారిశ్రామిక వృద్ధిని నేషనల్​స్టాటిస్టిక్స్​ ఆఫీస్​(ఎన్​ఎస్​ఓ) 5.1 శాతానికి సవరించింది. 

తయారీ రంగం ఉత్పత్తి ఆరు శాతం పెరగగా, గనుల తవ్వకం 3.1 శాతం వృద్ధి చెందింది. విద్యుత్​ ఉత్పత్తి 2.3 శాతం పెరిగింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​ నుంచి ఫిబ్రవరి మధ్య ఐఐపీ వృద్ధి 4.1 శాతంగా ఉంది. వాహనాలు, బేసిక్​ మెటల్స్​, యంత్రాల తయారీ రంగాలు సత్తా చాటాయి.