అగ్రి చట్టాలపై ప్రశ్నించిన అన్నదాతలను జైళ్లకు పంపుతారా?

అగ్రి చట్టాలపై ప్రశ్నించిన అన్నదాతలను జైళ్లకు పంపుతారా?

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాతలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తమ ఆందోళనలను ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. త్వరలో దేశవ్యాప్త పర్చటన నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ఈ మార్చ్‌‌లో భాగంగా కొత్త అగ్రి చట్టాలపై కేంద్ర తీరును ప్రజలకు వివరించి మద్దతును సమీకరిస్తామని తెలిపారు. అగ్రి చట్టాలపై గొంతెత్తుతున్న అన్నదాతలను కేంద్రం జైళ్లకు పంపుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చేపట్టే పర్యటనల్లో భాగంగా గుజరాత్ వెళ్తామని, ఆ రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు. దేశానికి స్వేచ్ఛ ఉంది కానీ గుజరాత్ ప్రజలు జైళ్లలో మగ్గుతున్నారని పేర్కొన్నారు.