అటవీ క్షీణతలో రెండో స్థానంలో భారత్​

అటవీ క్షీణతలో రెండో స్థానంలో భారత్​

2015–2020 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అటవీ ప్రాంతాల క్షీణతపై యూఎన్​ఓ అనుబంధ సంస్థ యుటిలిటీ బిడ్డరర్​ నివేదికను విడుదల చేసింది. ఇంధనం, యుటిలిటీ వ్యయాలు, అడవుల క్షీణతపై అధ్యయనం చేసిన సంస్థ.. 2015–2020 మధ్య ప్రపంచంలోనే అటవీ విస్తీర్ణం తగ్గుదలలో బ్రెజిల్​ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశం ఐదేళ్ల కాలంలో 41.88 లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కోల్పోయింది. భారత్​ 16.50 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం క్షీణతతో రెండో స్థానంలో ఉంది. 10.50 లక్షల ఎకరాల క్షీణతతో ఇండోనేషియా మూడో స్థానంలో ఉంది. గత 30ఏళ్లలో అటవీ ప్రాంతాల క్షీణతను పరిశీలిస్తే భారత్​లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక వెల్లడించింది. 1990–2000 అటవీ ప్రాంతాల క్షీణత రేటుతో పోలిస్తే 2015–2020లో దేశంలో అడవులు మరింత వేగంగా కనుమరుగవుతున్నాయి. 1990–2000 మధ్య అంటే 10 ఏళ్లలో దేశంలో 9.48 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం తగ్గింది. కానీ 2015–2020 అంటే ఐదేళ్లలోనే 16.50 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం తగ్గిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా పర్వత ప్రాంతాల్లో అడవులు వేగంగా తరిగిపోతున్నాయని నివేదిక వెల్లడించింది.