జపాన్ ప్రధానితో భేటి అయిన మోడీ

జపాన్ ప్రధానితో భేటి అయిన మోడీ

జీ 20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ.. ఆ దేశ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు. రెండు దేశాల విదేశాంగ మంత్రులతో పాటు.. అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్య అంశాలపై చర్చించారు. తాను రెండోసారి ప్రధాని అయ్యాక ఫోన్ లో షింజో అబే మొదటిసారి శుభాకాంక్షలు చెప్పారన్నారు మోడీ. ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. ఇక.. అవినీతి నిరోదక చర్యలపై ఈ భేటీలో చర్చించినట్టు చెప్పారు విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే. మోడీ, షింజో అబే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రేపు భేటీ అవుతారన్నారు.