IND vs ENG 3rd Test: గిల్ సెంచరీ మిస్..భారత్ ఆధిక్యం ఎంతంటే..?

IND vs ENG 3rd Test: గిల్ సెంచరీ మిస్..భారత్ ఆధిక్యం ఎంతంటే..?

రాజ్ కోట్ టెస్టులో టీమిండియా అదరగొడుతుంది. ఇంగ్లాండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచేందుకు సిద్ధంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో మన బ్యాటర్ల దెబ్బకు ఇంగ్లాండ్  బౌలర్లు తేలిపోయారు. నాలుగో రోజు తొలి సెషన్ ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 440 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో సెంచరీ హీరో జైస్వాల్ (149), సర్ఫరాజ్(22) ఉన్నారు. 

సెకండ్ ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. తొలి సెషన్ లో మరో 118 పరుగులు జోడించారు. ప్రారంభంలో కుల్దీప్ యాదవ్, గిల్ ఇంగ్లాండ్ బౌలర్లను విసుగుతెప్పిస్తూ వికెట్ ఇవ్వలేదు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డు ను ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ 54 పరుగుల భాగస్వామ్యం తర్వాత గిల్ రన్ ఔటయ్యాడు. 91 పరుగులు చేసిన గిల్. తృటిలో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. కాసేపటికే 27 పరుగులు చేసిన కుల్దీప్.. రెహన్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

ఈ  దశలో జైస్వాల్ కు జత కలిసిన సర్ఫరాజ్ భారత స్కోర్ ను పరుగులు పెట్టించారు. ముఖ్యంగా జైస్వాల్ భారీ మొదట్లో ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత దూకుడుని పెంచి భారీ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఐదో వికెట్ కు ఈ జోడీ 62 బంతుల్లోనే 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్, హర్టీలి, రెహన్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు. మూడో రోజు రిటైర్డ్ హర్ట్ తో వెనుదిరిగిన జైస్వాల్ నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో చెన్నైకి వెళ్లిన అశ్విన్ రాజ్ కోట్ కు బయల్దేరుతున్నట్టు సమాచారం.