దేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు నమోదు

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో మరోసారి 8 వేలకు పైగా కేసులొచ్చాయి. దేశంలో కొత్తగా 8,822 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో 5,718 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు 53 వేలకు పెరిగాయి. ప్రస్తుతం 53,637 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 2 శాతానికి పెరిగింది. వైరస్ బారిన పడి మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 195.5 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రం. 

కాగా, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇక్కడ 3 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,956 కొత్త కేసులు రాగా.. ముంబైలోనే అత్యధికంగా 1724 కేసులొచ్చాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18 వేల మార్క్ ను దాటాయి. అదే సమయంలో వైరస్ బారిన పడి నలుగురు చనిపోయారు. మరణాల రేటు 1.86 శాతానికి చేరింది.ఠానే ప్రాంతంలో రెండు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 1,118 కేసులొచ్చాయి. వైరస్ తో ఇద్దరు చనిపోయారు.ఇక్కడ ముందు రోజుతో పోలిస్తే.. 82 శాతం కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 6.5 శాతానికి పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం 3 వేల 177యాక్టివ్ కేసులున్నాయి.