
పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పహల్గామ్ దాడి తరువాత దాయాది దేశం పాకిస్తాన్ కు .. భారత్ వరుస వార్నింగ్లు ఇస్తుంది. . ఇప్పటికే దిగుమతులను కూడా నిషేధించింది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తాన్కు పోస్టల్ సర్వీసులు నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని రకాల పోస్టల్, పార్శిల్ సర్వీసుల మార్పిడిని తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని రకాల పోస్టల్... కొరియర్ సర్వీసులను నిలిపివేసింది. పాకిస్థాన్ నుంచి విమాన, భూ మార్గాల ద్వారా వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్శిళ్ల మార్పిడిని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య పోస్టల్ సేవలు చాలా కాలంగా పరిమిత స్థాయిలో కొనసాతున్నాయి. ఆర్టికల్ 370 తొలగించిన తరువాత పాకిస్థాన్ కొంతకాలం పోస్టల్ సేవలను కొంతకాలం నిలిపివేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అన్ని పోస్టల్, పార్శిల్ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పోస్టల్ సేవలు నిలిపివేయడం ఇరు దేశాల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు, ట్రేడ్ మెయిల్స్, వ్యక్తిగత పార్శిళ్ల మార్పిడి పూర్తిగా నిలిచిపోనున్నాయి. రెండు దేశాల మధ్య కుటుంబ ... వ్యాపార సంబంధాలపై ఆధారపడిన వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులు పోస్టల్ సేవల ద్వారా రవాణా అవుతున్నందున ఈ చర్య పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.