11 జిల్లాల్లో హీట్ వేవ్స్..​ వచ్చే 4 రోజులు ఎండలు తీవ్రం

11 జిల్లాల్లో హీట్ వేవ్స్..​ వచ్చే 4 రోజులు ఎండలు తీవ్రం
  • భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్‌‌‌‌లో 45.7 డిగ్రీల టెంపరేచర్​
  • 10 నాటికి రాష్ట్రంలోకి రుతుపవనాలు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 11 జిల్లాలకు భారత వాతావరణ శాఖ హీట్ వేవ్స్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని చెప్పింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో వేడి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్​లో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 45.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యనంబైలు, కుమ్రంభీం జిల్లా కుంచవెల్లిల్లో 45.3, జూలూరుపాడులో 45 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.
10న రుతుపవనాల రాకరుతుపవనాలు చురుగ్గా ముందుకు కదిలేం దుకు పరిస్థితులు మెరుగయ్యాయని వాతావ రణ శాఖ వెల్లడించింది. ఈ నెల 10 నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే చాన్స్ ఉందని పేర్కొంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని, దాని వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదిలేందుకు చాన్స్​ ఏర్పడిందని పేర్కొంది. మంగళవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా పొంకల్​లో అత్యధికంగా 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్​కర్నూల్ జిల్లా పాద్రాలో 2.8, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో 2.4, నాగర్​కర్నూల్ జిల్లా వాంకేశ్వర్​లో 2.3, జగిత్యాల జిల్లా ఐలాపూర్​లో 1.6 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.