ఈసారి మస్తు వానలు.. భారత వాతావరణ శాఖ వెల్లడి

ఈసారి మస్తు వానలు.. భారత వాతావరణ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ఈ సంవత్సరం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆగస్ట్, సెప్టెంబర్​లోపు లానినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్​ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లైమేట్ చేంజ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఒకేరకమైన వర్షపాతం ఉండదని ఆయన చెప్పారు. 

తక్కువ టైంలో ఎక్కువ వర్షాలు పడడం (రెయిన్ ఈవెంట్స్), వర్షాలు పడే రోజుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం మాత్రం విస్తారంగా వానలు కురుస్తాయన్నారు. 1951 నుంచి 2023 మధ్య తొమ్మిది సార్లు దేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అలాగే గత సంవత్సరంలో 820 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయిందని ఆయన పేర్కొన్నారు. 2023కు ముందు వరుసగా నాలుగుసార్లు దేశంలో సాధారణం, సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు.