
ముంబైలో ఇండియా కూటమి విలేకరుల సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి రోజురోజుకూ బలపడుతోందని, మొత్తం 28 పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ప్రసంగించారు. 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలు కాకుండా, వివిధ ప్రయోజనాల కోసం మరో 4 కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. తాము 2024లో గెలవబోతున్నామన్న ఆయన.. తమను ఓడించడం కష్టమే కాదు అసాధ్యం కూడా అని రౌత్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో సంయుక్తంగా పాల్గొనడం, సీట్ల కేటాయింపుకు సంబంధించి తక్షణమే చర్చలు ప్రారంభించడం, ఆలస్యం లేకుండా వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలను ప్రారంభించడం, "జుడేగా భారత్, జీతేగా ఇండియా" బ్యానర్ కింద తమ ప్రచారాలను సమకాలీకరిస్తామని ఆదిత్య థాక్రే అన్నారు. 'మిత్ర-పరివార్వాద్'కు వ్యతిరేకంగా పోరాడుతామన్న ఆయన.. ఎన్నికల సందర్భంగా 'సబ్కా సాత్ సబ్కా వికాస్' అంటూ నినాదాలు చేశారు. కానీ ఎన్నికల తర్వాత, వారు అందరికీ 'లాత్' ఇచ్చారు.. వారి స్నేహితులకు వికాస్ చేశారని ఆరోపించారు. వారు గ్యాస్ ధరలను తగ్గించారు, కానీ ప్రజలు దేంతో వంటలు చేస్తారో అవే అత్యంత ఖర్చుతో కూడుకున్నాయని చెప్పారు. ఈ పోరాటం తమది మాత్రమే కాదని అందరి పోరాటమని థాక్రే చెప్పారు.
"ఎన్నికలు ముందుగానే జరగవచ్చు. దాని కోసం మనం అప్రమత్తంగా ఉండాలి. కావున మేము ఇప్పుడు దాని గురించి కూడా చర్చించాము" అని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. వారు చరిత్రను మార్చాలనుకుంటున్నారని, కానీ తాము అది జరగనివ్వమని చెప్పారు. హిందూ-ముస్లిం తరహా విషయాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. ఈ దేశం అందరికీ చెందిందని చెప్పుకొచ్చారు. బీజేపీని వదిలించుకుంటే పత్రికా రంగ ప్రజలు తమకు కావలసినది రాసుకునే స్వేచ్ఛను మళ్లీ పొందుతారని చెప్పారు.
గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, దేశాన్ని రక్షించేందుకు తాము చేతులు కలుపుతున్నామని, కేంద్ర ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఇక భారత కూటమి 26-27 పార్టీల కూటమి మాత్రమే కాదని, ఇది 140 కోట్ల భారత ప్రజల కూటమి అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 21వ శతాబ్దపు కొత్త భారతదేశాన్ని సృష్టించేందుకు ప్రజలు కలిసి వస్తున్నారని ఆయన చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి మోదీ ప్రభుత్వమే అత్యంత అవినీతి ప్రభుత్వమని కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు 3 సమావేశాలకు హాజరయ్యానని, అంతర్గత విభేదాలు లేవని, ఎవరూ ఏ పదవి కోసం ఇక్కడికి రాలేదని ఆయన వివరించారు.