శ్రీలంకకు మరోసారి భారత్ అప్పు

శ్రీలంకకు మరోసారి భారత్ అప్పు

త్రీవ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో శ్రీలంకకు భారత ప్రభుత్వం మరోసారి ఆపన్న హస్తం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఆఫర్ చేసినట్లు కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ వెల్లడించింది.  భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్స మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. కాగా,  ఇప్పటికే భారత్ ఈ నెల మొదట్లో శ్రీలంకకు 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ ను అందించిందని హైకమిషన్ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

మంగళసూత్రం ధరించినప్పుడు అలా ఫీల్ అయ్యా: ప్రియాంకా చోప్రా

రిపబ్లిక్ డే వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ 

ఈ సారి రిపబ్లిక్ డేలో చాలా ప్రత్యేకతలు