కఠినం కానున్న విదేశీ పెట్టుబడుల రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?

కఠినం కానున్న విదేశీ పెట్టుబడుల రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?

న్యూఢిల్లీ: భారతదేశం విదేశీ యాజమాన్య నిబంధనలను కఠినతరం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ–-కామర్స్ నుంచి ఫార్మాస్యూటికల్స్ వరకు గల వివిధ వ్యాపారాలు ప్రభావితం కానున్నాయి.  షేర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్స్ లేదా రీస్ట్రక్చరింగ్స్ విషయంలో ఫారిన్ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ నిబంధనల కిందకు తీసుకురానున్నారు.  దీనికి సంబంధించిన చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయని ఇద్దరు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఫైనాన్స్ మినిస్ట్రీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ)   స్పందించలేదు. ఇండియా తన విదేశీ పెట్టుబడుల చట్టాలను సులభతరం చేయాలని,  ఏదైనా లూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్ ఉంటే పరిష్కరించాలని చూస్తోంది. 

ప్రభుత్వం “ఫారిన్- ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ ఎంటిటీస్” (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీఈ) అనే కొత్త కేటగిరీని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.  ఇందులో “పరోక్షంగా  విదేశీ పెట్టుబడి” ఉన్న భారతీయ కంపెనీలు కూడా ఉంటాయని పైన పేర్కొన్న అధికారులు తెలిపారు. “ప్రత్యక్షంగా చేయలేనిది పరోక్షంగా కూడా అనుమతించకూడదు. ఇది ఇప్పుడు రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది” అని అన్నారు.   ఎఫ్ఓసీఈ అనేది భారతదేశం వెలుపల నివసించే వ్యక్తులు  కంట్రోల్ చేస్తున్న భారతీయ కంపెనీ లేదా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వివరించొచ్చు. పరోక్ష షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డింగ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ జరిపితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.  సెక్టోరల్ విదేశీ పెట్టుబడులు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ పరిమితులకు  అనుగుణంగా ఉండాలి.