భారత్ నెంబర్ వన్... ఐక్యరాజ్య సమితి స్టడీ రిపోర్టు..

భారత్ నెంబర్ వన్... ఐక్యరాజ్య సమితి స్టడీ రిపోర్టు..
  • జనాభాలో చైనాను దాటేసి.. .ఇండియా నంబర్​1
  • మన దేశ జనాభా 142.86 కోట్లు
  • చైనాలో 142.57 కోట్లు
  • ఐక్యరాజ్య సమితి స్టడీ రిపోర్టులో వెల్లడి
  • చైనాలో జననాల రేటు తగ్గడంతో జనాభా డౌన్​

న్యూఢిల్లీ :ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా  భారత్​ నిలిచింది.  ఇప్పటివరకు పాపులేషన్​లో నంబర్​ వన్​ స్థానంలో ఉన్న చైనా.. ఇప్పుడు రెండో స్థానానికి చేరింది. యునైటెడ్​ నేషన్స్​ పాపులేషన్​ ఫండ్​ (యూఎన్ఎఫ్​పీఏ) విడుదల చేసిన ‘‘స్టేట్​ ఆఫ్ వరల్డ్​ పాపులేషన్’ (ఎస్​ఓడబ్ల్యూపీ) నివేదికలో ఈ విషయం వెల్లడైంది.  ‘8 బిలియన్​ లైవ్స్​, ఇన్ఫినిట్​పాజిబిలిటీస్​ : ది కేస్ ​ఫర్ ​రైట్స్​అండ్​ చాయిసెస్​’ పేరిట ఈ నివేదికను  బుధవారం రిలీజ్​ చేశారు. దీని ప్రకారం.. ప్రస్తుతం ఇండియా జనాభా 142.86 కోట్లు, చైనా జనాభా 142.57 కోట్లు. ఇదే లెక్కన జనాభా పెరిగితే ఇండియా జనాభా 2050 నాటికి 166.8 కోట్లకు  చేరుతుందని, చైనా జనాభా 131 కోట్లకు తగ్గుతుందని నివేదిక తెలిపింది. మన దేశ జనాభా వచ్చే 30 ఏళ్లపాటు పెరుగుతూపోతుందని.. 165 కోట్లకు చేరిన తర్వాత మళ్లీ తగ్గడం మొదలవుతుందని వివిధ సర్వే నివేదికలు ఇటీవల అంచనా వేశాయి.

 

1950 నుంచి ప్రతి ఏడాది దేశాలవారీగా జనాభా గణాంకాలను యూఎన్​ విడుదల చేస్తుండగా.. ఇందులో ఇండియా ఫస్ట్​ ప్లేస్​లో నిలవడం ఇదే తొలిసారి. 1950లోనే చైనా జనాభా 114 కోట్లు ఉండగా.. ఇండియా జనాభా 86 కోట్లు ఉండేది. కొన్నేళ్లలో చైనాలో జననాల రేటు బాగా తగ్గింది. దీంతో  అక్కడ జనాభా క్రమంగా తగ్గుతూ వ స్తోం ది. మళ్లీ జననాల రేటును పెంచేందుకు చైనాలోని చాలా ప్రావిన్స్​ల ప్రభుత్వాలు ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నాయి. అయినా పెద్దగా జనాభా పెరగడం లేదు. ఇక ఇండియాలో ప్రస్తుతం ఎంత జనాభా ఉందనే దానిపై  ప్రభుత్వం వద్ద తాజా అధికారిక లెక్కలేం లేవు. చివరగా 2011లో నిర్వహించిన సెన్సస్ (జన గణన)​ లెక్కలనే ఇప్పటికీ ప్రభుత్వ పథకాల అమలుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రతి పదేండ్లకు ఒకసారి మన దేశంలో సెన్సస్​ నిర్వహిస్తుంటారు. ఈ లెక్కన 2021లో నిర్వహించాల్సిన జనగణన కరోనా సంక్షోభ పరి స్థితుల కారణంగా వాయిదా పడింది. 34 కోట్ల జనాభాతో అమెరికా మూడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభా 2023 జూన్​ నాటికి 804 కోట్లకు చేరుతుందని యూఎన్​ నివేదిక అంచనా వేసింది.

మహిళా వివక్షపై యూఎన్​ ఆందోళన.. 

యూఎన్​ నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభాలో దాదాపు 1/4 వ వంతు మంది 14 ఏళ్లలోపువారే. 68 శాతం జనాభా 15 నుంచి 64 ఏళ్లలోపువారు. 7 శాతం జనాభా 65 ఏళ్లకు పైబడినవారు.  15-- -- 24 ఏళ్లలోపు యువకుల జనాభా 25.4 కోట్లు ఉంది. దేశంలో సంతానోత్పత్తి రేటు (మహిళల సగటు ప్రసవాలు) 2గా ఉంది.  ఇది ప్రపంచ సంతానోత్పత్తి రేటు (2.3) కంటే తక్కువే.  అభివృ ద్ధిచెందిన దేశాల్లో సంతానోత్పత్తి రేటు 1.5 గా, తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో 2.4 గా ఉంది. ఇండియా జనాభాలో దాదాపు సగం మం ది 25 ఏళ్లలోపు వారేనని నివేదిక తెలిపింది. భారత్​లో మహిళా వివక్షపై యూఎన్​ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఎంతమంది సంతానం కలిగి ఉండాలి ? ఎప్పుడు సంతానం పొందాలి ? అనే వాటిపై భార త మహిళలకు కుటుంబాలు  స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 66 శాతం మంది మహిళలు మాత్రమే సంతానం విషయంలో తమ ఇష్టం ప్రకారం నడు చుకోగలుగుతున్నారని తెలిపింది. 15‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 19 ఏళ్లలోపు యువతులలో గర్భం దాల్చే రేటు 11%ఉండగా.. 18 ఏళ్లకు ముందే పెళ్లిళ్లు జరుగుతున్న బాలికలు 23% మంది ఉన్నారని తెలిపింది.  12 నెలల్లో జీవిత భాగస్వామి నుంచి వేధింపులు ఎదుర్కొన్నామని 18% మంది భారత మహిళలు తాజా సర్వేలో చెప్పారని నివేదిక ప్రస్తావించింది. భారత్​లో ఆయుర్దాయం పురుషుల్లో సగటున 71 ఏళ్లు, మహిళల్లో సగటున  74 ఏళ్లు.  ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం మహిళల్లో 76 ఏళ్లు, పురుషుల్లో 71 ఏళ్లుగా ఉంది. అభివృద్ధిచెందిన దేశాల్లో ఆయుర్దాయం సగటు పురుషుల్లో 77 ఏళ్లు గా, మహిళల్లో 83 ఏళ్లుగా ఉంది. 

ఇండియాలో 1,007 మంది సర్వే.. 

జనాభా లెక్కల నివేదిక రూపకల్పనలో భాగంగా యూఎన్ఎఫ్ పీఏ అధ్యయన బృందం ఇండియా, బ్రెజిల్​, ఈజిప్ట్, ఫ్రాన్స్​, హంగెరీ, జపాన్​, నైజీరి యా, అమెరికాల్లోని దాదాపు 7,797 మందిని సర్వే చేసింది.  ఇండియా నుంచి 1,007 మంది అభిప్రాయాలను స్వీకరించారు. జనాభా పెరగ డం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని భారత్​లో సర్వేలో పాల్గొన్నవారిలో 63 శాతం మంది పేర్కొనగా.. పర్యావరణ సమస్యలు వస్తాయని 46 శాతం మంది చెప్పారు. సెక్సువల్​సమస్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, సంతానోత్పత్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్​తలెత్తవచ్చని 30 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 

 సంగమ్​ విహార్​ : 5 చ.కిమీలలో 12 లక్షల మంది  

ఆసియా ఖండంలోని అతిపెద్ద అనధికారిక కాలనీ గా ఢిల్లీలోని సంగమ్​ విహార్​ కు పేరుంది. ఇక్కడ 5 చదరపు కి.మీ ఏరియాలో 12 లక్షల జనాభా నివసిస్తోంది. ఇక్కడ నివసించే వారిలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వలస కూలీలే ఎక్కువ మంది ఉన్నారు. మున్సిపాలిటీ పంపించే వాటర్​ ట్యాంకర్ ​నీటితోనే వీళ్లు దాహం తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఉన్న శ్మశాన వాటిక 35 ఏళ్ల కిందట ఏర్పాటుచేసినది.  

ఇండియా, చైనాలో జనసాంద్రత ఇలా.. 

జనాభాపరంగా టాప్​10 ప్లేస్​లలో ఉన్న దేశాల్లో జన సాంద్రత విషయానికి వస్తే .. మొదటి స్థానంలో బంగ్లాదేశ్​ ఉంది.  అక్కడ -కేవలం 17.3 కోట్ల జనాభానే ఉన్నప్పటికీ జనసాంద్రత 1,265 గా ఉంది. అంటే ఆ దేశంలో ప్రతి చదరపు కిలోమీటరు జాగలో అంతమంది జీవిస్తున్నారన్న మాట. ఇక రెండో ప్లేస్​లో చైనా ఉంది. అక్కడ జనసాంద్రత 476. మూడో ప్లేస్​లో 287 జనసాంద్రతతో పాకిస్తాన్​, నాలుగో ప్లేస్​లో 226 జనసాంద్రతతో నైజీరియా ఉన్నాయి.  155 జనసాంద్రతతో ఇండియా ఐదో ప్లేస్​లో ఉంది. 

క్వాంటిటీ కాదు.. క్వాలిటీ కావాలి : చైనా 

జనాభాపరంగా భారత్​ మొదటి స్థానానికి  చేరడం పై చైనా నుంచి విభిన్నమైన స్పందన వచ్చింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్​ వెన్​బిన్​ను మీడియా ప్రతినిధులు స్పందన కోరగా.. ‘‘జనసంఖ్యలో క్వాంటిటీని కాదు.. క్వాలిటీని చూడాలి. జనాభా సంఖ్య ముఖ్యమే కానీ ట్యాలెంట్​అంతకంటే ముఖ్యం. చైనా జనాభా 140 కోట్లు. అందులో శ్రామిక వర్గం 90 కోట్లు ఉంది. వారంతా సగటున 10.5 ఏళ్లపాటు చదువుకున్నవారే ”అని పేర్కొన్నారు

అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలు