హాకీ వరల్డ్‌‌ కప్‌‌ రెండో రౌండ్‌‌ చివరి మ్యాచ్‌‌కు భారత్ రెడీ.. అర్జెంటీనాతో అమీతుమీ

హాకీ వరల్డ్‌‌ కప్‌‌ రెండో రౌండ్‌‌ చివరి మ్యాచ్‌‌కు భారత్ రెడీ.. అర్జెంటీనాతో అమీతుమీ

అమ్‌‌స్టెల్విన్‌‌ (నెదర్లాండ్స్‌‌): ఎఫ్‌‌ఐహెచ్‌‌ హాకీ వరల్డ్‌‌ కప్‌‌ రెండో రౌండ్‌‌ చివరి మ్యాచ్‌‌కు ఇండియా మెన్స్‌‌ టీమ్‌‌ రెడీ అయ్యింది. సోమవారం జరిగే ఈ పోరులో బలమైన అర్జెంటీనాతో తలపడనుంది. టోర్నీలో సెమీస్‌‌ చేరే అవకాశాలు సన్నగిల్లినప్పటికీ.. సాంకేతికంగా  రేసులో  నిలవాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌‌లో భారీ ఆధిక్యంతో విజయం సాధించాల్సి ఉంటుంది. కనీసం రెండు గోల్స్‌‌ తేడాలో అర్జెంటీనాపై గెలవాలి. 

అదే టైమ్‎లో తర్వాత జరిగే మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌పై నెదర్లాండ్స్‌‌ కనీసం మూడు గోల్స్‌‌ తేడాతో విజయం సాధించాలి. ఈ రెండు సమీకరణాలు కరెక్ట్‌‌గా నమోదైతేనే ఇండియా ముందంజ వేసే చాన్స్‌‌ ఉంటుంది. ఇది జరగాలంటే ముందు హర్మన్‌‌ప్రీత్‌‌ సేన.. అర్జెంటీనాతో మ్యాచ్‌‌లో శక్తికి మించి శ్రమించాలి. 

ఫార్వర్డ్స్‌‌, డిఫెన్స్‌‌ మంచి సమన్వయంతో ముందుకు కదలాలి. మరోవైపు గత ఎఫ్‌‌ఐహెచ్‌‌ ప్రో లీగ్‌‌ మ్యాచ్‌‌లో అర్జెంటీనా.. ఇండియాపై అద్భుతంగా ఆడింది. మాటియాస్‌‌ రే, గోల్‌‌ కీపర్‌‌ టోమాస్‌‌ శాంటియాగో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.