తెలంగాణ టెన్నిస్‌‌ ప్లేయర్‌ సహజకు షాక్‌‌.. ఆసియా క్రీడల జట్టు నుంచి ఔట్

తెలంగాణ టెన్నిస్‌‌ ప్లేయర్‌ సహజకు షాక్‌‌.. ఆసియా క్రీడల జట్టు నుంచి ఔట్

న్యూఢిల్లీ: తెలంగాణ టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ సహజ యమలపల్లికి ఊహించని షాక్‌‌ తగిలింది. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన టెన్నిస్‌‌ జట్టు నుంచి సహజ, వైష్ణవి ఆడ్కర్‌‌, వైదేహి చౌదరిలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జాబితాను కుదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐచినగోయాలో జరిగే ఆసియా క్రీడల కోసం 35 విభాగాల్లో 492 మంది అథ్లెట్లతో కూడిన జాబితాను ఈ నెల 22న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. 

అయితే టెన్నిస్‌‌లో 12 మందితో కూడిన జట్టును ఏఐటీఏ ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం దాన్ని ఏడుగురికి కుదించింది. దాంతో విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో అంకితా రైనా, రుతుజా బోసలే మాత్రమే చోటు దక్కించుకున్నాడు. మెన్స్‌‌లో సుమిత్‌‌ నాగల్‌‌, దక్షిణేశ్వర్‌‌ సురేశ్‌‌, డబుల్స్‌‌లో యూకీ భాంబ్రీ, శ్రీరామ్‌‌ బాలాజీ, అనిరుధ్‌‌ చంద్రశేఖర్‌‌ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆసియా క్రీడల్లో పోటీపడాలన్న తన ఆశ నెరవేరడం లేదని సహజ ఆవేదన వ్యక్తం చేసింది.