Yashasvi Jaiswal: శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో లంక పేసర్ అసిత ఫెర్నాండోతో చోటు చేసుకున్న ఘర్షణపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన విమర్శలకు భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. గ్రౌండ్ లో ఇంతకీ ఏం జరిగిందో మీకు తెలుసా అంటూ ప్రశ్నించాడు. స్టేడియంలో ఏం జరిగిందో తెలియకుండా అనవసరంగా తిట్టడం మంచిది కాదని పేర్కొన్నాడు. ఫెర్మాండోతో నేను కావాలని గొడవ పడలేదని జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
ఫెర్నాండో వివాదంపై భోగ్లే వ్యాఖ్యలు:
మైదానంలో ఫెర్నాండో రెచ్చగొట్టడంతో కోపానికి గురైన జైస్వాల్, అతని వైపు దూసుకెళ్లి హెడ్‌బట్ (తల తాకించేలా) చేయడానికి యత్నించాడు. ఈ ఘటనపై క్రిక్‌బజ్ వీడియోలో మాట్లాడిన హర్షా భోగ్లే... ఫెర్నాండో రెచ్చగొట్టిన మాట నిజమే అయినప్పటికీ, జైస్వాల్ తిరిగి అతని దగ్గరకు వెళ్లడం ద్వారా గీత దాటాడని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయాల్లో వివాదం నుంచి పక్కకు తప్పుకోవడమే మంచిదని, జైస్వాల్‌లోని ఆవేశం అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను దెబ్బతీయకూడదని సూచించాడు.
ఏమన్నాడో తెలియకుండా తీర్పులు చెప్పొద్దు:
హర్షా భోగ్లే అభిప్రాయంతో ఏకీభవించని యశస్వీ జైస్వాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రిక్‌బజ్ పోస్ట్‌పై స్పందిస్తూ... అవతలి వ్యక్తి నాతో ఏమన్నాడో పూర్తిగా తెలియకుండా దయచేసి ఎలాంటి తీర్పులు చెప్పకండి అని రాసుకొచ్చాడు. మైదానంలో వారి మధ్య జరిగిన సంభాషణ యొక్క సందర్భం (Context) చాలా ముఖ్యమైనదని స్పష్టం చేశాడు. ఎవరైనా హద్దు దాటి ప్రవర్తిస్తే వారికి విషయం తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ భారత్ పోరాడుతుంది, తగిన సమాధానం ఇస్తుందంటూ తేల్చి చెప్పాడు. మైదానంలో ప్రత్యర్థుల ఆధిపత్యానికి లేదా రెచ్చగొట్టే చర్యలకు ఏమాత్రం తగ్గేదే లేదని ఈ యంగ్ ఓపెనర్ పేర్కొన్నాడు.
🥵 THINGS GET HEATED! 🥵
— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026
Yashasvi Jaiswal and Asitha Fernando exchange words as tensions rise in the middle. 👀
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/7qJrORjx8V
