బెంగళూరు: నార్త్ ఈస్ట్ జోన్‌తో ఆదివారం ప్రారంభమైన దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. సుదీప్ కుమార్ గరామి (146), షాబాజ్ అహ్మద్ (100 బ్యాటింగ్) సెంచరీలు చేయడంతో టాస్ ఓడిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 355/6 స్కోరు చేసింది. ఆట ముగిసే టైమ్‌కు షాబాజ్‌తో పాటు అనుకూల్ రాయ్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అభిమన్యు ఈశ్వరన్ (15), వైభవ్ సూర్యవంశీ (8), విరాట్ సింగ్ (2), ఇషాన్ కిషన్ (4) విఫలమయ్యారు. సుదీప్, షాబాజ్ ఆరో వికెట్‌కు 150 రన్స్ జోడించారు.
నార్త్ జోన్ 251
వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న క్వార్టర్‌ఫైనల్లో నార్త్ జోన్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. అన్షుల్ కాంబోజ్ (60), ఆయుష్ బదోనీ (51), ఆయుష్ డోసెజా (42) మినహా మిగతా వారు నిరాశపర్చడంతో.. నార్త్ తొలి ఇన్నింగ్స్‌లో 66.5 ఓవర్లలో 251 రన్స్‌కు ఆలౌటైంది. తనుష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే చెరో నాలుగు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 31/2 స్కోరు చేసింది. ముషీర్ ఖాన్ (6 బ్యాటింగ్), శివాలిక్ శర్మ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
