న్యూఢిల్లీ: టీమిండియా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్ స్టార్స్‌కు ఆడుతున్న కర్ణ్ ఈ నెల 25న మీరట్ మావెరిక్స్‌తో జరిగే మ్యాచ్ కెరీర్‌లో చివరిదని ప్రకటించాడు. 2014లో ఇండియా తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల కర్ణ్ ఒక టెస్ట్, ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 97 మ్యాచ్‌లు ఆడిన అతను 27.60 సగటుతో 270 వికెట్లు తీశాడు. 138 ఇన్నింగ్స్‌ల్లో 2866 రన్స్ సాధించాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లతో (సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016, ముంబై ఇండియన్స్ 2017, చెన్నై సూపర్‌కింగ్స్ 2018) వరుసగా మూడు ట్రోఫీలు గెలిచిన ఏకైక క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తంగా కర్ణ్ ఖాతాలో నాలుగు ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్, క్రికెట్‌కు సంబంధించిన ఇతర బాధ్యతల్లో పని చేస్తానని కర్ణ్ వెల్లడించాడు.
