ఆల్ టైమ్ రికార్డ్.. ఒక్కరోజే 6148 కరోనా మరణాలు

V6 Velugu Posted on Jun 10, 2021

వరుసగా రెండో రోజు దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి... మొన్నటి వరకు వరుసగా తగ్గుకుంటూ వచ్చిన కేసులు రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో 24 గంటల్లో దేశంలో 94 వేల 52 కేసులు నమోదు అయ్యాయి. అయితే మరణాల రేటు ఒక్కసారిగా రికార్డ్ స్థాయిలో పెరిగింది. ఒక్క రోజులో 6 వేల 148 మంది మృతి చెందారు. నిన్న వరకు రెండు నుంచి మూడు వేల లోపు ఉన్న మరణాల సంఖ్య ఇవాళ ఏకంగా 6 వేలు దాటింది.  దీంతో దేశంలో ఒక్కరోజులో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మరణాల సంఖ్య. ఓవర్ ఆల్ గా దేశంలో 3 లక్షల 59 వేల 676 మంది వైరస్ తో చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 11 లక్షల 67 వేల 952 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అటు దేశవ్యాప్తంగా 24 కోట్ల 27 లక్షల 26 వేల 693 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు అధికారులు. 

Tagged single day, 6, India reporte, 052 new COVID-19 cases, 148 new deaths, 94%

Latest Videos

Subscribe Now

More News