
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతోంది. గత నాలుగు రోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 10,46,605 మందికి టెస్టులు చేయగా 89,129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్త కోటి 23 లక్షల 92 వేల 260 కి చేరాయి. నిన్న ఒక్కరోజే 714 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,64,110 కి చేరింది. నిన్న 44,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కోటి 15లక్షల 69 వేల241 మంది కోలుకున్నారు..ఇంకా 6,58,909 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు 7 కోట్ల 30లక్షల 5 వేల 295 మందికి వ్యాక్సిన్ వేశారు.