తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదు రోజులు 12 వేలకు పైగా కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.  నిన్నటితో పోలిస్తే 22.4శాతం కేసులు తగ్గాయి. అటు కరోనాతో  కొత్తగా 17 మంది మృతి చెందారు.  దీనితో మృతుల సంఖ్య 5,24,890కి చేరుకుంది.  కొత్తగా 7,293 మంది రోగులు డిశార్జి కావడంతో కోలుకున్న వారి సంఖ్య 4,27,15,193కి చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 79,313 యాక్టీవ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.55శాతంగా ఉందని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.