ఆదుకున్న రాహుల్‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియా–ఎకు ధీటుగా బదులిస్తోన్న ఇండియా

ఆదుకున్న రాహుల్‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియా–ఎకు ధీటుగా బదులిస్తోన్న ఇండియా

లక్నో: ఆస్ట్రేలియా–ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్‌‎లో ఇండియా దీటుగా బదులిస్తోంది. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (77 రిటైర్డ్‌‌‌‌‌‌‌‌హర్ట్‌‌‌‌‌‌‌‌), సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ (44 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) పోరాటం చేయడంతో.. 412 రన్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్య ఛేదనలో ఇండియా రెండో ఇన్నింగ్స్‌‎లో 41 ఓవర్లలో 169/2 స్కోరు చేసింది. ఆట ముగిసే టైమ్‌‎కు సుదర్శన్‌‌‌‌‌‌‌‌తో పాటు మానవ్‌‌‌‌‌‌‌‌ సుతార్‌‌‌‌‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. నారాయణ్‌‌‌‌‌‌‌‌జగదీశన్‌‌‌‌‌‌‌‌ (36), రాహుల్‌‌‌‌‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 85 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. 

దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌ (5) ఫెయిలయ్యాడు. టాడ్‌‌‌‌‌‌‌‌ మర్ఫి రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు 16/3 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 46.5 ఓవర్లలో 185 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో ఇండియా ముందు 412 రన్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్యాన్ని ఉంచింది. నేథన్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌స్వీని (85 నాటౌట్‌‌‌‌‌‌‌‌), జోస్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (50) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు చేశారు. గుర్నూర్‌‌‌‌‌‌‌‌ బ్రార్‌‌‌‌‌‌‌‌, మానవ్‌‌‌‌‌‌‌‌ సుతార్‌‌‌‌‌‌‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. ఇండియా ఇంకా 243 రన్స్​ చేయాల్సి ఉంది.