మన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతాలకు పేర్లు మారుస్తున్న చైనా: ఓవరాక్షన్ వద్దంటూ మోదీ సర్కార్ వార్నింగ్

మన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతాలకు పేర్లు మారుస్తున్న చైనా: ఓవరాక్షన్ వద్దంటూ మోదీ సర్కార్ వార్నింగ్

ఎంత దారుణం.. ఎంత దుర్మార్గం.. ఎంత కండకావరం చైనాకు.. మన దేశంలో.. మన దేశంలోని రాష్ట్రం అయిన అరుచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మారుస్తున్నది చైనా. డ్రాగన్ దేశం సరిహద్దుల్లో ఉన్న అరుచల్ ప్రదేశ్ ప్రాంతంలోని కొన్నింటి పేర్లను మార్చటంతో.. ఇప్పుడు ఇండియా.. చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం మరోమారు చర్చనీయాంశమైంది. 

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలకు పేర్లు మార్చినందు వల్ల.. అది చైనా దేశానికి సొత్తు కాదని.. ముమ్మాటికీ అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగం అంటూ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇండియా విదేశాంగ శాఖ. ఇలాంటి పనులు చేయటం చైనాకు కొత్త కాదని.. గతంలోనూ చేసిందని.. పేర్లు మార్చినంత మాత్రాన చైనాలో ఆ భూభాగం కలిసిపోదంటూ చైనాకు స్పష్టం చేసింది. వెంటనే ఇలాంటి ప్రయత్నాలను.. పనికిమాలిన చర్యలను కట్టిపెట్టాలంటూ డ్రాగన్ దేశానికి గట్టిగానే చెప్పింది మోదీ ప్రభుత్వం.

ఇండియాచైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు మార్చే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా భారత విదేశాంగ శాఖనే వెల్లడించింది. ఈ విషయంలో చైనాను ఇండియా తిట్టిపోసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, అంగీకరించక తప్పని వాస్తవం పేర్లు మార్చితే ప్రత్యామ్నయం అయిపోదని భారత విదేశాంగ శాఖ చైనాపై మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు మార్చే సాహసం చేసిందని తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలను భారత్ తిప్పికొడుతుందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. 

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అణువణువూ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్లోని అంతర్భాగమేనని ఆయన మరోమారు కుండబద్ధలు కొట్టారు. 2024లో కూడా చైనా ఇలాంటి పనే చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు 30 కొత్త పేర్లు పెట్టి ఓవరాక్షన్ చేసింది. చైనా చేసిన ఈ దురాగతాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ పేర్లను కొట్టిపారేసింది.