న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో రూ.1.70 లక్షల కోట్ల గ్రాస్ జీఎస్‌టీ రెవెన్యూ వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. కిందటేడాది నవంబర్‌లో వచ్చిన రూ.1.69 లక్షల కోట్లతో పోలిస్తే 0.7 శాతం మాత్రమే పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీ 2.0 ని అమలు చేస్తోంది.
సుమారు 400 వస్తువులపై ట్యాక్స్ తగ్గించింది. దీంతో జీఎస్‌టీ వసూళ్లు తగ్గాయి. నవంబర్ నెలకు సంబంధించి నెట్ జీఎస్‌టీ (రీఫండ్స్ ఇచ్చిన తర్వాత) రెవెన్యూ రూ.1.52లక్షల కోట్లుగా ఉంది. ఏడాది లెక్కన 1.3 శాతం పెరిగింది. గ్రాస్ డొమెస్టిక్ రెవెన్యూ 2.3 శాతం తగ్గి రూ.1.24 లక్షల కోట్లకు, దిగుమతుల నుంచి వచ్చిన జీఎస్‌టీ రెవెన్యూ 10.2 శాతం పెరిగి రూ.45,976 కోట్లకు చేరాయి.
