
గ్వాంగ్జు (సౌత్ కొరియా): ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా తొలి రోజే రెండు పతకాలను ఖరారు చేసుకుంది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో కూడిన మిక్స్‌డ్ టీమ్‌తో పాటు మెన్స్ టీమ్ ఫైనల్ చేరి స్వర్ణం కోసం పోరాడనున్నాయి. శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో సురేఖ –రిషభ్ యాదవ్‌తో కూడిన ఇండియా 157–-155తో చైనీస్ తైపీ జట్టును ఓడించింది.
గోల్డ్ మెడల్ కోసం నెదర్లాండ్స్ ఆర్చర్లతో తలపడనుంది. మెన్స్ కాంపౌండ్ ఈవెంట్‌లో రిషభ్ యాదవ్, అమన్ సైనీ, ప్రథమేశ్ ఫ్యూగేతో కూడిన జట్టు సెమీఫైనల్లో 234-–232 స్కోరుతో మూడో సీడ్ టర్కీ జట్టును ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఫైనల్లో ఇండియా.. ఫ్రాన్స్‌తో తలపడుతుంది. విమెన్స్ టీమ్ విభాగంలో జ్యోతి, పర్నీత్ కౌర్, పృథికా ప్రదీప్‌తో కూడిన జట్టు ప్రి-క్వార్టర్స్‌లోనే 229–233తో 14వ సీడ్ ఇటలీ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. కాంపౌండ్ మెన్స్ వ్యక్తిగత విభాగంలో రిషభ్ యాదవ్ తో పాటు అమన్ సైనీ, ప్రథమేశ్ ఎలిమినేషన్ రౌండ్లలోకి
ప్రవేశించారు.