సర్వీస్ సెక్టార్ జోరు.. కొత్త వ్యాపారాలు పెరగడం, ధరల ఒత్తిడి తగ్గడం ఈ వృద్ధికి కారణాలు

సర్వీస్ సెక్టార్ జోరు.. కొత్త వ్యాపారాలు పెరగడం, ధరల ఒత్తిడి తగ్గడం ఈ వృద్ధికి కారణాలు

న్యూఢిల్లీ: సర్వీస్ సెక్టార్ వృద్ధి గత నెలలో పుంజుకుంది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 58.9 నుంచి నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 59.8 కి పెరిగింది. కొత్త వ్యాపారాలు పెరగడం, ధరల ఒత్తిడి తగ్గడం ఈ వృద్ధికి కారణాలు. పీఎంఐ పరిభాషలో 50 కంటే ఎక్కువ స్కోరు వృద్ధిని సూచిస్తుంది. ఈసారి అంతర్జాతీయ అమ్మకాలు మెరుగుపడ్డాయి. 

ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ నుంచి కంపెనీలకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. అయితే, అంతర్జాతీయ పోటీ కారణంగా వృద్ధి రేటు ఎనిమిది నెలల కనిష్టానికి తగ్గింది. ఉద్యోగ కల్పన కొద్దిగానే ఉందని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ తెలిపింది.