ఇండియా షూటర్ల గురి అదుర్స్‌ : వరల్డ్‌‌కప్‌ లో ఐదు గోల్డ్‌‌ మెడల్స్‌ తో టాప్‌ ప్లేస్‌

ఇండియా షూటర్ల  గురి అదుర్స్‌ : వరల్డ్‌‌కప్‌ లో ఐదు గోల్డ్‌‌ మెడల్స్‌ తో టాప్‌ ప్లేస్‌

మ్యూనిక్‌ : ఐఎస్‌ ఎస్‌ ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ లో ఇండియా షూటర్లు అదగరొట్టారు. చివరి రోజు రెండు స్వర్ణాలు, ఒక రజతం నెగ్గి  టోర్నీకి అద్భుత ముగిం పునిచ్చారు. ఓవరాల్‌‌గా ఐదు గోల్డ్‌ , ఒక సిల్వర్‌ తో ఆరు మెడల్స్‌‌తో ఇండియా టాప్‌ ప్లేస్‌ తో వరల్డ్‌ కప్‌ లో బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌ నమోదు చేసింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రై ఫిల్‌‌ మిక్స్‌‌డ్‌ టీమ్‌‌ ఈవెంట్‌ లో స్టార్‌ షూటర్‌ అంజుమ్‌‌ మౌద్గిల్‌‌–యంగ్‌ స్టర్‌ దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వర్‌ గోల్డ్‌ నెగ్గగా, సీనియర్ ద్వయం అపూర్వి చండేలా–దీపక్‌ కుమార్‌ సిల్వర్‌ గెలిచింది. 10 మీ. ఎయిర్‌ పి స్టల్‌‌ మిక్స్​డ్‌ టీమ్‌‌ విభాగంలో మను భాకర్‌ –సౌరభ్‌ చౌదరి జోడీ బంగారు పతకం గెలిచింది.

కొత్త ఫార్మాట్‌ లో జరిగిన ఎయిర్‌ రై ఫిల్‌‌ గోల్డ్‌ మెడల్‌‌ మ్యాచ్‌ లో అంజుమ్‌‌–దివ్యాన్ష్‌ (ఇండియా–1) 16–2తో అపూర్వి–దీపక్‌ (ఇండియా–2) జంటను చిత్తుగా ఓడించింది. ఇక, మిక్స్‌‌డ్‌ ఎయిర్‌ పిస్టల్‌‌ గోల్డ్‌ మెడల్‌‌ మ్యాచ్‌ లో మను భాకర్‌ సౌరభ్‌ చౌదరి జంట 17–9తో  ఉక్రెయిన్‌ కు చెందిన ఒలెనా కొస్తెవిచ్‌ –ఒమెల్‌‌చుక్‌ ఒలెను చిత్తుగా ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.