మంచితనాన్నిభారత్ చేతకానితనంగా భావిస్తుంది: పాక్

మంచితనాన్నిభారత్ చేతకానితనంగా భావిస్తుంది: పాక్

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ తన వ్యవహార శైలిని మార్చుకోవడం లేదు. మద్దతు కోసం రోజుకో దేశాన్ని ఆశ్రయిస్తుంది. లేటెస్ట్ గా  భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని  పాకిస్థాన్ ఐక్యారాజ్యసమితికి లేటర్ రాసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి యుఎన్‌ఎస్‌సి అధ్యక్షుడు జోవన్నా వ్రోనెక్కాకు మంగళవారం ఒక లెటర్ రాశారు.

‘భారత్ నిర్ణయం వల్ల అంతర్జాతీయ భద్రతకు ముప్పుకల్గుతుంది. దీనిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మా నిగ్రహాన్ని భారత్ చేతకాని తనంగా భావిస్తుంది‘ అని రాశారు. దీనిపైన 15 మంది సభ్యుల కమిటీ ఎలా స్పందిస్తుందనేది తెలియదు.అయితే  దీనిపై స్పందించిన పోలాండ్ విదేశాంగ శాఖ మంత్రి పాక్ నుంచి  ఐక్యరాజ్యసమితికి లెటర్ అందిందని..చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.