ఓటమి తప్పేనా.. గిల్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ పోరాటం.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 174/2

ఓటమి తప్పేనా.. గిల్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ పోరాటం.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 174/2
  • స్టోక్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ సెంచరీ
  • తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 669 ఆలౌట్‌‌‌‌‌‌‌‌

మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో నాలుగో టెస్టులో  ఓటమి తప్పించుకునేందుకు ఇండియా పోరాడుతోంది.  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేయడంలో బౌలర్లు ఫెయిలైనా.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (210 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లతో 87 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (167 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లతో 78 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) నిలబడ్డారు. రెండు సెషన్ల పాటు వికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఫలితంగా 311 రన్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ లోటుతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన ఇండియా శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లలో 174/2 స్కోరు చేసింది. ప్రస్తుతానికి టీమిండియా ఇంకా 137 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది. ఆఖరి రోజు మూడు సెషన్లు ఆడితేనే ఇండియా డ్రాతో గట్టెక్కగలదు.  లేదంటే మ్యాచ్‌‌తో పాటు సిరీస్ ఓటమి తప్పదు. ఆదివారం తొలి సెషన్‌‌‌‌‌‌‌‌ ఆట జట్టుకు కీలకం కానుంది.  అంతకుముందు 544/7 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరు వద్ద ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 157.1 ఓవర్లలో 669 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ జట్టు 311 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (198 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 141) మూడేండ్ల తర్వాత సెంచరీతో చెలరేగగా, బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్స్‌‌‌‌‌‌‌‌ (47) అండగా నిలిచాడు.   

స్టోక్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌..
మూడో రోజు ఆటతో పోలిస్తే శనివారం ఇండియన్‌‌‌‌‌‌‌‌ పేసర్లు బుమ్రా (2/112), సిరాజ్‌‌‌‌‌‌‌‌ (1/140) మరింత తీవ్రతతో బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసినా.. స్టోక్స్‌‌‌‌‌‌‌‌ పట్టుదల ముందు ఇది సరిపోలేదు. ఫలితంగా ఓల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రాఫోర్డ్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ జట్టు అత్యధిక స్కోరు చేయకుండా ఆపలేకపోయారు. ఆరంభంలోలోనే లియామ్‌‌‌‌‌‌‌‌ డాసన్‌‌‌‌‌‌‌‌ (26)ను బుమ్రా క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేశాడు.. ఈ దశలో వచ్చిన బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్స్‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా ఆడాడు. వీలైనప్పుడల్లా బాల్‌‌‌‌‌‌‌‌ను బౌండ్రీని దాటించాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని స్టోక్స్‌‌‌‌‌‌‌‌ క్రీజు నుంచి బయటకు వచ్చి కవర్స్‌‌‌‌‌‌‌‌లో చకచకా బౌండ్రీలు రాబట్టాడు. ఈ క్రమంలో 164 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 14వ సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇద్దరి మధ్య తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 95 రన్స్‌‌‌‌‌‌‌‌ జతయ్యాయి. అయితే ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో జడేజా (4/143) తన వరుస ఓవర్లలో ఈ ఇద్దర్ని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి ఉపశమనం కలిగించాడు. స్ట్రయిట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను సిక్స్‌‌‌‌‌‌‌‌గా మలిచే క్రమంలో స్టోక్స్‌‌‌‌‌‌‌‌.. లాంగాన్‌‌‌‌‌‌‌‌లో సుదర్శన్‌‌‌‌‌‌‌‌ చేతికి చిక్కాడు. జడ్డూ టర్నింగ్ బాల్‌‌‌‌‌‌‌‌ను స్లాగ్ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేసిన కార్స్‌‌‌‌‌‌‌‌.. సిరాజ్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 

గిల్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ అదుర్స్‌‌‌‌‌‌‌‌..
లంచ్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు 20 నిమిషాల ముందు రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన ఇండియాకు తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌ (2/48) దిమ్మతిరిగే షాకిచ్చాడు. తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌ నాలుగు, ఐదో బాల్స్‌‌‌‌‌‌‌‌కు వరుసగా యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (0), సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ (0)ను డకౌట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దాంతో ఇండియా 0/2తో కష్టాల్లో పడింది. మూడు ఓవర్లు ఆడి 1/2 స్కోరుతో లంచ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన టీమిండియాను రెండో సెషన్‌‌‌‌‌‌‌‌లో రాహుల్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌ ఆదుకున్నారు.  నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే గిల్ ఎల్బీ కోసం అప్పీల్‌‌‌‌‌‌‌‌ చేయగా రివ్యూలో నాటౌట్‌‌‌‌‌‌‌‌గా తేలింది. ఇక స్వింగ్‌‌‌‌‌‌‌‌, పేస్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా బౌన్స్‌‌‌‌‌‌‌‌తో ఈ త్రయం ముప్పేట దాడికి దిగింది. అయితే రాహుల్‌‌‌‌‌‌‌‌ టెక్నికల్‌‌‌‌‌‌‌‌గా ఆడుతూ సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో నెట్టుకొచ్చాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌ మాత్రం చాన్స్‌‌‌‌‌‌‌‌ దొరికినప్పుడల్లా ఫోర్లు బాది ఒత్తిడి తగ్గించాడు.

15.2 ఓవర్లలో స్కోరు 50/2కి చేరింది. 23వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మరోసారి గిల్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ కోసం అప్పీల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. కానీ బాల్‌‌‌‌‌‌‌‌ వికెట్ల పైకి వెళ్లడంతో రివ్యూలో బతికిపోయాడు. ఈ క్రమంలో గిల్‌‌‌‌‌‌‌‌ 77 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ సెషన్‌‌‌‌‌‌‌‌లో 26 ఓవర్లు ఆడి 85 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేశారు. ఇక మూడో సెషన్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ బౌలర్లకు పరీక్షగా మారింది. ఆర్చర్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌, స్వింగ్‌‌‌‌‌‌‌‌తో రాహుల్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసినా ఏమాత్రం తడబడలేదు. 141 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌ కూడా ఎక్కడా చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా ముందుకెళ్లాడు. ఈ జోడీని విడదీసేందుకు స్టోక్స్‌‌‌‌‌‌‌‌ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సక్సెస్‌‌‌‌‌‌‌‌ కాలేదు. కనీసం వీళ్లిద్దరు రివ్యూ చాన్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వలేదు. ఈ సెషన్‌‌‌‌‌‌‌‌లో 34 ఓవర్లలో 88 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. 

సంక్షిప్త స్కోర్లు

  • ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 358 ఆలౌట్‌‌‌‌‌‌‌‌. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 157.1 ఓవర్లలో 669 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (స్టోక్స్‌‌‌‌‌‌‌‌ 141, కార్స్‌‌‌‌‌‌‌‌ 47, జడేజా 4/143, బుమ్రా 2/112, సుందర్‌‌‌‌‌‌‌‌ 2/107). 
  • ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 63 ఓవర్లలో 174/2 (గిల్‌‌‌‌‌‌‌‌ 78*, రాహుల్‌‌‌‌‌‌‌‌ 87*, వోక్స్‌‌‌‌‌‌‌‌ 2/48). 
  • 1.. బుమ్రా తన టెస్ట్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఒక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 100 రన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం ఇదే తొలిసారి. 
  • 1.. 2014 తర్వాత ఇండియా ఒక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 600 రన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం ఇదే తొలిసారి.
  • 1.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ హిస్టరీలో ఒకే మ్యాచ్‌‌లో ఐదు వికెట్లు, సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌. 
  • 3.. టెస్ట్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో 7 వేల రన్స్‌‌‌‌‌‌‌‌, 200 వికెట్లు తీసిన మూడో ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (7000/229). జాక్వెస్‌‌‌‌‌‌‌‌ కలిస్‌‌‌‌‌‌‌‌ (13,289/292), గ్యారీ సోబర్స్‌‌‌‌‌‌‌‌ (8032/235) ముందున్నారు.